పిఠాపురంలో పవన్ తరపున నాగబాబు!

పిఠాపురంలో పవన్ గెలిస్తే ప్రజలకు అందుబాటులో వుండేది ఎవరు? పెద్ద పెద్ద వాళ్లు అందరు ఎమ్మెల్యేల మాదిరిగా లోకల్ గా అందుబాటులో వుండరు. బాలయ్య తరపున మేనేజర్ హిందూపురంలో వుంటారు. చంద్రబాబు తరపున డిటో. జగన్ తరపున అవినాష్ రెడ్డి వుంటారు. ఇలా చాలా మందికి వాళ్ల బ్రదర్స్ లోకల్ గా వుండి సమస్యలు పరిష్కరిస్తుంటారు.

జనసేన అధిపతి పవన్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. గెలిచినా, గెలవకున్నా పవన్ పిఠాపురంలో వుండేది లేదు. గెలిస్తే ఎవరు లోకల్ గా జనాలకు అందుబాటులో వుంటారు?  నాగబాబే అన్న సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే నాగబాబు, ఆయన భార్య, ఆయన కొడుకు ప్రచారంలో పాల్గొన్నారు. పవన్ గెలిస్తే ఇక పిఠాపురంలో నాగబాబే ఎమ్మెల్యే అనుకోవాలి.

వర్మ గెలిపించడం వరలే. అంతే తప్ప వర్మకు లోకల్ గా తన తరపున పనులు చక్కబెట్టే బాధ్యత పవన్ ఇస్తారని అనుకోవడానికి లేదు. అదృష్టం బాగుండి చంద్రబాబుకు అధికారం అందినా వర్మకు ఎమ్మెల్సీనో లేదా ఏ నామినేటెడ్ పోస్ట్ నో వుంటుంది. కానీ ఎమ్మెల్యే హోదా వేరు. అది ఇక వర్మకు అందనిదే. దాని కోసం వేరే నియోజక వర్గం వెదుక్కోవాలి.

ఎన్నిక కాకపోయినా నాగబాబు మాత్రం లోకల్ గా డిఫ్యాక్టో ఎమ్మెల్యే మాదిరిగా హల్ చల్ చేసుకోవచ్చు.