జగన్ ఈజ్ బ్యాక్.. ఇక నుంచి మరో ఎత్తు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర పునఃప్రారంభం అయ్యింది. 17 రోజుల విరామం అనంతరం జగన్ మళ్లీ ప్రజల మధ్యకు పాదయాత్రతో వచ్చాడు. హత్యాయత్నం నేపథ్యంలో గాయపడ్డ జగన్ కోలుకుని పాదయాత్రను కొనసాగిస్తున్నాడు. సోమవారం ఉదయం సాలూరు నియోజకవర్గం పాయకపాడు నుంచి జగన్ ప్రజాసంకల్ప యాత్ర పునఃప్రారంభం అయ్యింది.

జగన్ పాదయాత్ర ఇదివరకూ సాగింది ఒకఎత్తు అయితే ఇకపై మరో ఎత్తు అని చెప్పవచ్చు. ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగే దౌర్భాగ్య పరిస్థితి ఏపీలో ఉందని తెలిసిపోయింది. జగన్ పై హత్యాయత్నాన్ని ఏపీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఎంత తక్కువ చేసి చూపినా.. దానిపై వ్యంగ్యంగా, గేలిచేస్తూ స్పందించినా.. బాబు పాలన వైఫల్యానికి అది నిదర్శనమే అవుతుంది.

అదే సమయంలో ఆ హత్యాయత్నం వెనుక తెలుగుదేశం పార్టీ ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూటిగా ఆరోపిస్తోంది. కుట్రకోణాన్ని బయటకు తీయాలని డిమాండ్ చేస్తోంది. జరుగుతున్న విచారణ పట్ల వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

మరోవైపు విచారణకు జగన్ సహకరించడం లేదు అని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. కోర్టుకూ ఇదే చెబుతోంది. అయినా జగన్ సహకరించడం అంటే ఏమిటి? ఇక్కడ విచారించింది హత్యాయత్నం చేసిన వ్యక్తినా? లేక అనూహ్యంగా దాడికి గురైన వ్యక్తినా? అనే బేసిక్ డౌట్స్ మిగిలిపోయాయి.

ఇలాంటి పరిణామాలన్నింటి మధ్యనా జగన్ పాదయాత్ర మళ్లీ మొదలైంది. రెట్టించిన ఉత్సాహంతో తమ నాయకుడికి స్వాగతం పలికాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఇక జగన్ పాదయాత్ర ముగింపుకు కూడా మరెంతో దూరంలేదు.

హత్యాయత్నం జరగకపోయి ఉంటే.. ఈ పాటికి జగన్ పాదయాత్ర దాదాపు ముగిసేది. పాదయాత్ర పూర్తి అయిన వెంటనే జగన్ బస్సు యాత్రకు కూడా సమాయత్తం అవుతున్నాడని తెలుస్తోంది. 

టీడీపీలోకి పంపి.. ఎమ్మెల్సీ సీట్లను కొనిచ్చిన చరిత్ర ఆయనది.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments