ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకోవడమే ఆలస్యం... తన సహచరులకు మంత్రిత్వ శాఖలను కూడా కేటాయించారు. సీనియర్ నేతల్ని మంత్రులుగా తీసుకున్న సంగతి తెలిసిందే. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. సీనియర్లు అసంతృప్తికి లోనుకాకుండా కేబినెట్‌లోకి తీసుకోవడంతో పాటు వారికి శాఖల కేటాయింపులో పెద్దపీట వేశారు.
సీఎంతో పాటు మొత్తం 12 మంది ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. 11 మంది మంత్రుల్లో భట్టి విక్రమార్కను డిప్యూటీ సీఎంగా నియమించారు. ఎవరెవరికి ఏఏ శాఖలు కేటాయించారో తెలుసుకుందాం.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రెవెన్యూ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి హోం, సీతక్కకు గిరిజన సంక్షేమశాఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మున్సిపల్, తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు, భవనాల శాఖ, పొన్నం ప్రభాకర్‌కు బీసీ సంక్షేమం, శ్రీధర్‌బాబుకు ఆర్థిక, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి నీటి పారుదల, కొండా సురేఖకు మహిళా సంక్షేమం, దామోదర రాజనర్సింహకు వైద్య, ఆరోగ్యం, జూపల్లి కృష్ణారావుకు పౌరసరఫరాల శాఖలను కేటాయించారు.
వీరిలో మొదటిసారి మంత్రిత్వ బాధ్యతలను భట్టి విక్రమార్క, సీతక్క, పొన్నం, పొంగులేటి చేపట్టడం విశేషం. మిగిలిన వారంతా గతంలో మంత్రులుగా పని చేసిన అనుభవం వుంది. గతంలో భట్టి విక్రమార్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చీఫ్ విప్‌గా, అలాగే డిప్యూటీ స్పీకర్‌గా విధులు నిర్వర్తించారు. పొంగులేటి, పొన్నం ప్రభాకర్‌లు ఎంపీలుగా పని చేశారు.