విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాను అడ్డుకున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ సభలో ప్రకటించారు. విశాఖ ప్రైవేటీకరణ అంశాన్ని తాను బీజేపీ కేంద్ర పెద్దల వద్ద ప్రస్తావించానని అది ఆగిపోయిందని పవన్ అంటున్నారు. తన మాటను కేంద్ర హోం మంత్రి అమిత్ షా గౌరవించారని పవన్ చెబుతున్నారు.
అయితే పవన్ చెప్పినట్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపొతే మాత్రం కేంద్రంలో నాయకత్వం వహిస్తున్న బీజేపీ ఎందుకు చెప్పదని అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకూడని వేయి రోజులకు పైగా ఉక్కు కార్మికులు పోరాడుతున్నారు. ఈ రోజుకీ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి.
కేంద్ర మంత్రులు కూడా ఉక్కు ప్రైవేటీకరణ పాలసీలో భాగమని పలు సందర్భాలలో ప్రకటించారు. ఉక్కు ప్రైవేట్ పరం కాదని కేంద్రం పార్లమెంట్ లో స్పష్టమైన ప్రకటన చేస్తే నమ్ముతామని ఉక్కు కార్మిక సంఘాలు అంటున్నాయి.
అయితే పవన్ కళ్యాణ్ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోయినట్లే అంటున్నారు. అదే నిజం అయితే కేంద్రం ప్రకటించవచ్చు కదా అని అంటున్నారు. విశాఖ ఉక్కు విషయంలో బీజేపీ నేతలు కూడా తలో రకంగా మాట్లాడుతున్నారని ఇప్పటికే వామపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. పవన్ సైతం విశాఖ ఉక్కు మీద క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి అంటున్నారు.