బీజేపీ ఆశీస్సులు కావాలంటున్న పవన్...!

బీజేపీతో అఫీషియల్ గా పొత్తు జనసేనకు ఉంది. అయితే ఇపుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు జనసేన అధినేత. ఏకంగా బహిరంగ వేదికను ఎక్కారు. విజయనగరం జిల్లాలో జరిగిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు పవన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీతో జనసేన పొత్తు మీద ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

టీడీపీతో పొత్తు ఏమీ ఆశించి పెట్టుకోలేదు అంటూ పవన్ కామెంట్స్ చేయడం విశేషం. ఏపీని కాపాడుకునేదుకే పొత్తు అన్నారు. ఈ పొత్తుకు బీజేపీ ఆశీస్సులు కూడా కావాలని పవన్ అనడం మరో చిత్రం. ఏపీలో టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ హై కమాండ్ ఇంకా ఏమీ తేల్చలేదు. అయితే తాను టీడీపీతో పొత్తుకు కలసిరావాలని బీజేపీ పెద్దలను కోరినట్లుగా పవన్ వెల్లడించారు.

ఏపీలో టీడీపీ జనసేన పొత్తుకు మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి అమిత్ షాను కోరినట్లుగా పవన్ చెప్పారు. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే భవిష్యత్తులో వైసీపీ గూండాలతో రోడ్ల మీదకు వచ్చి కొట్లాడాల్సి వస్తుందని పవన్ హెచ్చరించడం విశేషం.

ఇక జగన్ మీద పవన్ తన స్పీచ్ లో అనాల్సినవి అన్నీ అనేశారు. జగన్ కి ప్రజాస్వామ్యమంటే అర్ధం తెలియదు అని ఘాటైన విమర్శలు చేశారు. తల్లిని చెల్లెలుని గౌరవించ‌ని జగన్ ఏపీలో మహిళలకు ఏమి గౌరవం ఇస్తారు అని ప్రశ్నించారు. సోనియాగాంధీ జగన్ని అరెస్ట్ చేయించి అని పవన్ చెప్పడం మరో విశేషం. Readmore!

సోనియాగాంధీ అరెస్ట్ చేయిస్తే చంద్రబాబు మీద ఎందుకు జగన్ కి కక్ష అని పవన్ ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ అయితే తనకు ఎంతో బాధ కలిగింది అని పవన్ నిండు సభలో మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను టీడీపీకి కష్టకాలంలో మద్దతు తెలిపానన్నారు. టీడీపీతో పొత్తు వల్ల తాను ఏమీ ఆశించడంలేదని పవన్ మళ్లీ చెప్పారు.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని పవన్ అంటున్నారు. ఈ పొత్తు అనివార్యం అవసరం అని ఆయన నొక్కి చెప్పారు. ఏపీలో మారాల్సింది మార్చాల్సింది జగన్ని తప్ప ఎమ్మెల్యేలను కానే కాదని ఆయన అంటున్నారు.

జగన్ విపక్షాల మీద దాడులు చేయిస్తున్నారు అని మరో ఆరోపణ పవన్ చేసారు. ఏపీలో వైసీపీ గద్దె దిగాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు. యువగళం పాదయాత్రలో పవన్ జగన్ మీదనే ఫోకస్ చేసి స్పీచ్ ఇచ్చారు. జనసేన అవసరం టీడీపీకి ఉందనీ చెప్పారు. పొత్తులతోనే అధికారం అని కూడా తమ్ముళ్లకు అర్ధమయ్యేలా చెప్పారు. బీజేపీని కూటమిలోకి రావాలని పిలుపు ఇచ్చారు. పవన్ స్పీచ్ తరువాత బీజేపీ ఏమి ఆలోచిస్తుందో అన్నది ఇపుడు డిస్కషన్ గా ఉంది.

Show comments

Related Stories :