వాళ్లిద్దరూ కలిస్తే రచ్చ రంబోళానే.. కానీ..!

తెలుగులో బెస్ట్ డాన్సర్ అంటే ఇద్దరు ముగ్గురు హీరోల పేర్లు వినిపిస్తాయేమో కానీ, కోలీవుడ్ లో మాత్రం ది బెస్ట్ డాన్సర్ అంటే విజయ్ మాత్రమే. వయసు పెరిగినా అతడిలో ఎనర్జీ తగ్గలేదు. ఇలాంటి హీరోతో, టాలీవుడ్ డాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల జతకడితే ఎలా ఉంటుంది.. డాన్స్ ఫ్లోర్ దద్దరిల్లిపోవాల్సిందే.

వీళ్లిద్దరూ కలిసి ఓ డాన్స్ నంబర్ చేయబోతున్నారంటూ 3 రోజులుగా ఊహాగానాలు చెలరేగాయి. కానీ ఇప్పుడవన్నీ పుకార్లుగానే మిగిలిపోయేలా ఉన్నాయి. ఎందుకంటే, విజయ్ సరసన డాన్స్ చేసే ఆఫర్ ను శ్రీలీల తిరస్కరించింది.

విజయ్ సరసన హీరోయిన్ గా ఆఫర్ వస్తే ఎవ్వరూ వదులుకోరు. పైగా కోలీవుడ్ లో జెండా పాతాలని ట్రై చేస్తున్న శ్రీలీల అస్సలు వదులుకోదు. కానీ ఇది హీరోయిన్ ఛాన్స్ కాదు, కేవలం ఓ స్పెషల్ సాంగ్ మాత్రమే.

కోలీవుడ్ లో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా పరిచయమవ్వాలనేది శ్రీలీల కోరిక. దానికోసం ఆమె వెయిట్ చేస్తున్న టైమ్ లో ఈ డాన్స్ నంబర్ ఆఫర్ వచ్చింది. అందుకే అది విజయ్ సినిమా అయినప్పటికీ సున్నితంగా తిరస్కరించింది శ్రీలీల.

Readmore!

అయితే ఆమెకు మళ్లీ ఫ్యూచర్ లో విజయ్ నుంచి ఆఫర్ రాకపోవచ్చు. ఎందుకంటే, రాజకీయాల్లోకి వచ్చిన విజయ్, తన సినీ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్టు ప్రకటించాడు. ప్రస్తుతం చేస్తున్న గోట్ మూవీ తర్వాత ఇంకొక్క సినిమా మాత్రమే చేయబోతున్నాడు.

Show comments

Related Stories :