లేడీ గ్యాంగ్ స్టర్ గా నటించాలని ఉంది

హీరోహీరోయిన్లలో ప్రతి ఒక్కరికి డ్రీమ్ రోల్స్ ఉంటాయి. హాట్ హీరోయిన్ మాళవిక మోహనన్ కు కూడా అలాంటి డ్రీమ్ రోల్ ఉంది. అదే లేడీ గ్యాంగ్ స్టర్ పాత్ర.

"గ్యాంగ్ స్టర్ రోల్ పోషించాలని ఉంది. ఓ హీరోయిన్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తే చూడ్డానికి బాగుంటుంది కదా. అంతేకాదు, నేను ఈమధ్య యాక్షన్ సీక్వెన్స్ కోసం ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. కాబట్టి లేడీ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తే బాగుంటుంది."

లేడీ గ్యాంగ్ స్టర్ గా నటించడం తనకు ఇష్టమే కానీ, అలాంటి పాత్రను చూడ్డానికి మాత్రం తను ఇష్టపడనంటోంది. విక్రమ్ సరసన తంగలాన్ సినిమా చేసింది ఈ బ్యూటీ. ఆ సినిమాలో తన పాత్రపై కొంత యాక్షన్ పార్ట్ ఉంటుందని చెప్పుకొచ్చింది.

ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో మాట్లాడిన ఈ బ్యూటీ.. రెండు అంశాలపై సూటిగా-ఘాటుగా స్పందించింది. పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు "నా పెళ్లిపై నీకెందుకు అంత తొందర" అని ఎదురుప్రశ్న వేసింది. ఇక నిత్యం హాట్ ఫొటోషూట్స్ లో ఎందుకు కనిపిస్తావనే ప్రశ్నకు.. 'అలా కనిపించడం నాకిష్టం' అంటూ బోల్డ్ గా సమాధానం ఇచ్చింది.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాలో మెయిన్ హీరోయిన్ రోల్ పోషిస్తోంది మాళవిక మోహనన్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది.

Show comments

Related Stories :