స్వ‌ర్ణ కంక‌ణం - ముస‌లి పులి

ఒక ముస‌లి పులి నీటి మ‌డుగులో వుండి బాట‌సారుల్ని పిలిచేది. న‌న్ను మ‌డుగులోంచి లాగితే మీకు స్వ‌ర్ణ కంకణం ఇస్తాన‌ని న‌మ్మ‌బ‌లికేది. బంగారం మీది ఆశ‌తో వెళ్లిన వాళ్ల‌ని న‌మిలి తినేసేది. ఇక్క‌డ ముస‌లి పులి చంద్ర‌బాబు. స్వర్ణ కంక‌ణం మానిఫెస్టో. న‌మ్మిన వాళ్లు బ‌లి.

46 ఏళ్ల‌లో పేద వాళ్ల గురించి ఏనాడూ ఆలోచించ‌ని చంద్ర‌బాబు ఇపుడు బిస్కెట్ వేసాడు. ఆశ ప‌డితే గోతిలోకే. బాబు చ‌రిత్ర తెలిసిన వాళ్లు ఎవ‌రూ అత‌నికి పేద‌లంటే ప్రేమ వుంద‌ని న‌మ్మ‌రు. అవ‌కాశం కోసం, అధికారం కోసం ఏమైనా చేస్తాడు. మామ‌కి పొడిచాడు. తోడ‌ల్లుడిని (ద‌గ్గుబాటి) మోసం చేసాడు. హ‌రికృష్ణ‌ని న‌మ్మించాడు. బాల‌కృష్ణ‌ని వియ్యంతో క‌ట్టి ప‌డేసాడు. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ని వాడి వ‌దిలేసాడు. సొంత త‌మ్ముడు పిచ్చోడైతే (రామ్మూర్తినాయుడు) ప‌ట్టించుకోలేదు. మ‌నిషిగా ఎక్క‌డా స్పందించ‌ని బాబు ఈ రోజు పేద‌ల‌పై ప్రేమ చూపితే న‌మ్మిన వాళ్లు వెర్రివాళ్లు.

అధికారం కోసం కొత్త నాట‌కం, అవ‌తారం. సంవ‌త్స‌రానికి రూ.1.50 ల‌క్ష‌ల కోట్లు ఎక్క‌డ నుంచి తెస్తాడు? తేలేన‌ని తెలుసు. కానీ ఈ ఒక్క‌సారి జ‌నాన్ని న‌మ్మిస్తే మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి. ప‌ద‌వి కావాలి. విశ్వ‌స‌నీయ‌త అన‌వ‌స‌రం. మోసం కొత్త‌కాదు, ద‌శాబ్దాలుగా చేస్తున్న‌దే.

ఆయ‌న‌కి తోడు ప్యాకేజీ స్టార్‌. ప‌దేళ్లుగా పార్టీని బాబుకి అమ్మేసి కాపుల ర‌క్ష‌కుడిగా అవ‌తార‌మెత్తిన హీరో. చంద్ర‌బాబుని ముఖ్య‌మంత్రిగా చూడ‌డ‌మే ఆయ‌న క‌ల‌. అదే జెండా, ఎజెండా.

Readmore!

అర‌చేతిలో స్వ‌ర్గం. అంద‌రికీ పంచుతున్న అద్భుతం. మ్యాజిక్ షో మ‌ళ్లీ ప్రారంభం. అన్నీ జ‌రిగిన‌ట్టే వుంటాయి. ఏదీ నిజం కాదు.

చేతికి అంద‌ని పలావ్ కంటే, అందే అన్నం గొప్ప‌. ఈ నిజం తెలిసే జ‌గ‌న్ హెచ్చుల‌కి పోకుండా ఇవ్వ‌గ‌లిగిందే చెప్పాడు. విశ్వ‌స‌నీయ‌త అంటే అది. త‌న‌ని న‌మ్మ‌ర‌ని తెలిసే బాబు చాంతాడంత వాగ్దానాలు చేస్తున్నాడు. గెలిస్తే ప‌థ‌కాలు క‌న‌ప‌డ‌వు, బాబు క‌న‌ప‌డ‌డు.

ప్ర‌జ‌ల‌కి ఆశ క‌ల్పిస్తున్నాడు. న‌మ్మితే అస‌లుకే మోసం. పేద ప్ర‌జ‌ల‌కు బాబు మేలు చేయ‌గా చూసిన వాళ్లు లేరు. ఉచిత విద్యుత్ అని వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అంటే తీగ‌ల మీద బ‌ట్ట‌లు ఆరేసుకోవాల‌ని ఎద్దేవా చేసాడు. వ్య‌వ‌సాయం దండ‌గ అని, రైతుల‌కి స‌బ్సిడీ ఇస్తానంటున్నాడు.  

పులికి తిన‌డ‌మే తెలుసు, ఇవ్వ‌డం తెలియ‌దు. భ‌క్ష‌ణే త‌ప్ప‌, ర‌క్ష‌ణ తెలియ‌దు. ఇద్ద‌రు న‌టులు రంగు పూసుకుని వ‌చ్చారు. బాబు స‌హ‌జ న‌టుడు. ప‌వ‌న్‌కి న‌ట‌న వృత్తి. ముంచ‌డం త‌ప్ప‌, ప్రేమించ‌డం తెలియ‌ని వాళ్లు. వ‌ల‌ల‌తో వేట‌గాళ్లు వ‌స్తున్నారు. క‌ల‌ల వ్యాపారులు, న‌మ్మితే అమ్మేస్తారు.

Show comments