గట్టిగా ట్రై చేశాడు కానీ ఫలితం లేదు

ఇన్నాళ్లూ చప్పుడు చేయని పవన్ కల్యాణ్ సినిమాలు ఇప్పుడే ఎందుకు తెరపైకొస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏళ్లుగా సాగుతున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి ఉరుము లేని పిడుగులా టీజర్ ఎందుకొచ్చింది? కాస్త ఆలోచిస్తే దీనికి సమాధానం ఇట్టే తెలిసిపోతుంది.

ఇది ఎన్నికల సీజన్. తనకు కలిసొచ్చే ఏ అంశాన్ని విడిచిపెట్టడం లేదు పవన్. మరీ ముఖ్యంగా తను చేస్తున్న సినిమాల్ని ఈ ఎన్నికల కోసం ఎలా వాడుకోవాలనే అంశంపై ఇప్పటికే అతడు ఓ నిర్ణయానికి వచ్చాడు. ఇందులో భాగంగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి గ్లింప్స్ వచ్చింది. చేతిలో టీ గ్లాస్ పట్టుకొని 'గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది.' అన్నాడు.

ఇప్పుడు హరిహర వీరమల్లు వంతు వచ్చింది. అందరి లెక్కలు తేల్చడానికి వచ్చాడంటూ ఇందులో కూడా ఓ వాయిస్ ఓవర్ పెట్టారు. ఈ డైలాగ్, దానికి సంబంధించిన విజువల్స్ హీరోయిజం ఎలివేట్ చేయడానికి సరిపోయాయి కానీ, పవన్ కు ఈ ఎన్నికల టైమ్ లో మాత్రం పెద్దగా ఇది కలిసిరాదనే చెప్పాలి. 

ఇక పవన్ కల్యాణ్ కు సంబంధించి మిగిలిన సినిమా ఓజీ మాత్రమే. ఈ సినిమా వర్క్ కూడా నడుస్తోంది. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఇందులోంచి కూడా ఏదైనా డైలాగ్ బయటకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

Readmore!

ఇక హరిహర వీరమల్లు టీజర్ విషయానికొస్తే.. సినిమా కథ ఏంటి, జానర్ ఏంటనే విషయాన్ని బయటపెట్టారు. రీసెంట్ గా సెట్స్ లో చేరిన బాబీ డియోల్ పై తీసిన సన్నివేశాల్ని కూడా ఇందులో యాడ్ చేశారు. నిజానికి అర్జున్ రాంపాల్ చేయాల్సిన పాత్ర ఇది. సినిమా షూట్ ఆలస్యమౌతుండడంతో.. ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. బాబీ డియోల్ వచ్చి చేరాడు.

వీరమల్లుగా పవన్ లుక్ ఆల్రెడీ చూసేశాం. ఇప్పుడు ఆయనలోని యాక్షన్ కోణాన్ని టీజర్ ఆవిష్కరించింది. ఇక మొఘల్ రాజుగా బాబీ డియోల్ సరిగ్గా సెట్ అయ్యాడు. నేపథ్యంతో పాటు.. హీరో-విలన్ ను పరిచయం చేయడం వరకే టీజర్ ను పరిమితం చేశారు. హీరోయిన్ ను చూపించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్, కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.

Show comments

Related Stories :