ఎన్నిక‌లు పూర్తిగానే... జ‌గ‌న్ వెళ్లేది ఎక్క‌డంటే?

అన్ని రాజ‌కీయ పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఎన్నిక‌ల్లో త‌ల‌మున‌క‌ల‌య్యారు. ప్ర‌చారానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. దీంతో ప్ర‌జాభిమానాన్ని చూర‌గొనేందుకు నాయ‌కులు త‌మ‌దైన రీతిలో ప్ర‌చారం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల అనంత‌రం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి సంబంధించి వివ‌రాలు తెలిశాయి.

ఈ నెల 13న లోక్‌స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌లు పూర్తి అవుతాయి. అనంత‌రం త‌న స‌తీమ‌ణి వైఎస్ భార‌తితో క‌లిసి లండ‌న్ వెళ్లేందుకు ఆయ‌న ఏర్పాట్లు చేసుకున్నారు.  30వ తేదీ వ‌ర‌కు ఆయ‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉంటార‌ని స‌మాచారం. 

జ‌గ‌న్ కుమార్తె లండ‌న్‌లో ఉన్నారు. బ‌హుశా జ‌గ‌న్ లండ‌న్ చేరుకునే స‌మ‌యానికి కుటుంబ‌మంతా ఒకే చోట క‌లుసుకునే ఏర్పాట్లు జ‌రిగి ఉండొచ్చు. ఎన్నిక‌ల కోసం కొన్ని నెల‌లుగా జ‌గ‌న్ చాలా బిజీగా గ‌డిపారు. దీంతో కాసింత రిలాక్ష్ కోసం ఆయ‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌కు ప్లాన్ చేసుకున్నారు.

మ‌రోసారి అధికారంలోకి వ‌స్తామ‌న్న ధీమా జ‌గ‌న్‌తో పాటు వైసీపీలో క‌నిపిస్తోంది. మెజార్టీ స‌ర్వేల‌న్నీ వైసీపీదే ప్ర‌భుత్వం అని చెబుతున్నాయి. వ‌చ్చే నెల 4న కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది. ప్ర‌జాతీర్పున‌కు నాలుగు రోజుల ముందు జ‌గ‌న్ విదేశాల నుంచి తిరిగి రానున్నారు.

Readmore!

Show comments