ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ రేంజ్ ఇంతేనా!

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడు పవన్. తను అనుకున్నది అనుకున్నట్టు జరగాల్సిందే. ఆయన సుప్రీమ్. ఆయనే అన్నీ. పవన్ కు ఫ్యాన్స్ ఉండరు, భక్తులు మాత్రమే ఉంటారని వేదికలపై ఎంతోమంది గొప్పగా చెప్పిన పర్సనాలిటీ అతడిది. మరి అలాంటి వ్యక్తి ఎన్నికల రణరంగంలో దిగినప్పుడు ఏం జరగాలి? ఇండస్ట్రీ మొత్తం కదలిరావాలి కదా? మరి ఆ ఊపు కనిపించడం లేదు ఎందుకని?

పవన్ పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. పార్టీ పెట్టిన ఈ పదేళ్లలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా అసెంబ్లీలో అడుగుపెట్టిన జనసేనాని, ఈసారి ఎలాగైనా కనీసం ఎమ్మెల్యేగానైనా గెలవాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. చంద్రబాబు సహకారం, ప్రోత్సాహం తీసుకొని పిఠాపురం నుంచి బరిలోకి దిగారు.

పవన్ కల్యాణ్ కోసం టాలీవుడ్ క్యూ కడుతుందని అంతా అనుకున్నారు. హీరోలంతా పిఠాపురం వస్తారని ఊహించారు. కానీ అలా జరగలేదు. జబర్దస్త్ బ్యాచ్ తోనే పవన్ కల్యాణ్ సర్దుకోవాల్సి వచ్చింది.

పవన్ కోసం ప్రముఖులు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. పవన్ కు అడ్వాన్సులిచ్చిన నాగవంశీ, ఏఎం రత్నం లాంటోళ్లు మాత్రమే బయటకొచ్చారు. మిగతా జనమంతా జబర్దస్ట్ ఆర్టిస్టులే. చివరికి మెగా కాంపౌండ్ లో ఉన్న బన్నీ కూడా ఇప్పటివరకు మాట్లాడలేదు. పవన్ కు మంచి స్నేహితుడుగా భావించే మహేష్ బాబు సైలెంట్ అయ్యాడు. ప్రభాస్ పేరు గట్టిగా వినిపించినా అదంతా పుకారుగానే మిగిలింది.

Readmore!

వెంకటేశ్, నాగార్జున సంగతి సరేసరి. నాని మాత్రం ఉన్నంతలో ముందుకొచ్చాడు. ఇక చిరంజీవి, రామ్ చరణ్ విషయానికొస్తే.. ఓ వీడియో రిలీజ్ చేయడం వరకు మాత్రమే చిరంజీవి పరిమితమయ్యారు. అంతకుమించి తన నుంచి ఎక్కువ ఆశించొద్దని కూడా చెప్పేశారు. ఇక రామ్ చరణ్ అయితే, చిరంజీవి వదిలిన వీడియోను షేర్ చేయడం వరకు మాత్రమే. వరణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ మాత్రం ప్రచారం చేశారు. పవన్ రేంజ్ కు వీళ్లిద్దరు సరిపోతారేమో.

మిగిలిన ఈ కొద్ది రోజుల్లో కూడా మెగా కాంపౌండ్ నుంచి పెద్దగా ఎవ్వరూ ముందుకొచ్చేలా లేరు. పద్మవిభూషణ్ అవార్డ్ అందుకునేందుకు ఆల్రెడీ చిరు, చరణ్ కుటుంబాలతో సహా ఢిల్లీ చేరుకున్నారు. సో.. కీలకమైన ఈ కొద్ది రోజుల్లో పవన్ ఎలాంటి ప్రచార వ్యూహాన్ని అనుసరిస్తారో చూడాలి.

Show comments

Related Stories :