విశాఖ వెరీ స్పెషల్ గురూ!

ఈసారి ఎన్నికల్లో విశాఖ వెరీ స్పెషల్ గా నిలుస్తోంది. విశాఖ ఎంపీ సీటు అంటే ప్రతిష్టాత్మకంగా అంతా భావిస్తారు. ఇక్కడ నుంచి గెలిస్తే చాలు దేశం మొత్తం చూస్తుంది. ఆసియా ఖండంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ ఏపీలో ఏకైక మెగా సిటీ అని చెప్పాల్సి ఉంది.

ఈసారి ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటుకు పోటీ పడుతున్న వారు ఏపీలో మొత్తం పాతిక ఎంపీ సీట్లలో పోలిస్తే అత్యధికులు గా ఉన్నారు. 33 మంది అభ్యర్థులు విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. దాంతో విశాఖలో చాలా ఆసక్తికరమైన పోరు సాగనుంది అని అంటున్నారు.

విశాఖ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో ఎస్ కోట విజయనగరం పరిధిలోనిది కావడం విశేషం. మిగిలిన వాటిలో విశాఖ సిటీ పరిధిలో నాలుగు ఉంటే పారిశ్రామిక వాడగా పేరున్న చోట గాజువాక సీటు ఉంది. భీమునిపట్నం అటు పట్టణ ఇటు గ్రామీణ వాతావరంతో నిండిన అసెంబ్లీ సీటు.

విశాఖ ఎంపీ సీటు పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య  ఇరవై లక్షల 12 వేల మంది దాకా ఉంది. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. భీమునిపట్నంలో అయితే మూడు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా ఓటర్లు ఉన్న అసెంబ్లీ సీట్లలో ఏపీలో ఇది ఒకటిగా ఉంది. విశాఖ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ కోసమే 13 వేల పై దాటి అధికారులను నియమిస్తున్నారు. ఓటర్లు సజావుగా ఓటు హక్కుని వినియోగించుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. Readmore!

విశాఖ ఎంపీ సీటు విషయానికి వస్తే తెన్నేటి విశ్వనాధం, పీవీజీ రాజు, ద్రోణంరాజు సత్యనారాయణ, భాట్టం శ్రీరామ మూర్తి వంటి ఉద్ధండులు నెగ్గి ఖ్యాతి తెచ్చారు. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా ఎంపీ పదవికి పోటీ చేసిన లంకా సుందరం విశాఖ నుంచి గెలిచి రికార్డు సృష్టించారు. ఆ తరువాత ఇండిపెండెంట్ గా నెగ్గిన చరిత్ర లేదు.

Show comments

Related Stories :