సలార్ కోసం హిందీ నటుడ్ని ఎందుకు తీసుకోలేదు?

భగవంత్ కేసరి కోసం అర్జున్ రాంపాల్ ను తీసుకున్నారు. ఓజీ కోసం ఇమ్రాన్ హస్మిని తీసుకున్నారు. హరిహర వీరమల్లు కోసం బాబీ డియోల్ ను తీసుకున్నారు. దేవర కోసం సైఫ్ అలీఖాన్ ను తీసుకున్నారు. మరి సలార్ కోసం ఎందుకు ఓ బాలీవుడ్ నటుడ్ని తీసుకోలేదు?

విలన్ లేదా కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ నటుడ్ని తీసుకోవడం ఇప్పుడు ట్రెండ్. ఇలా చేస్తే పాన్ ఇండియా అప్పీల్ వస్తుందనేది చాలామంది మేకర్స్ ఫీలింగ్. మరి సలార్ కోసం ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు. సౌత్ కు చెందిన పృధ్వీరాజ్ ను తీసుకున్నారెందుకు?

దీనికి దర్శకుడు ప్రశాంత్ నీల్ దగ్గర స్పష్టమైన సమాధానం ఉంది. నిజానికి ప్రభాస్ ఫ్రెండ్ పాత్రలో ఓ బాలీవుడ్ నటుడ్ని తీసుకోమని చాలామంది చెప్పారట. నిర్మాతలైతే ఒకరిద్దరి పేర్లను కూడా సూచించారట. అయితే ప్రశాంత్ నీల్ మనసులో మాత్రం పృధ్వీరాజ్ ఉన్నాడట.

సలార్ లోని వరదరాజ్ మన్నార్ పాత్రను పృధ్వీరాజ్ చేసినట్టు కలలుకనేవాడంట ప్రశాంత్. అందుకే ముందుగా వెళ్లి అతడికే స్టోరీ చెప్పాడట. నిజానికి పృధ్వీరాజ్ ఈ కథ ఒప్పుకోడనే ఫీలింగ్ తో వెళ్లి నెరేషన్ ఇచ్చాడట. Readmore!

అయితే ఎప్పుడైతే ఓ నటుడిగా కాకుండా, దర్శకుడిగా పృధ్వీరాజ్ ఈ కథను వింటున్నాడని అర్థం చేసుకున్నాడో.. ఇక ఆ క్షణం నుంచి సలార్ స్టోరీని పూర్తిస్థాయిలో పృధ్వీరాజ్ కు నెరేట్ చేశాడట ప్రశాంత్ నీల్. కథ విన్న తర్వాత వెంటనే నటించడానికి ఒప్పుకున్నాడట పృధ్వీరాజ్.

ఒకవేళ పృధ్వీరాజ్ ఒప్పుకోకపోతే, అప్పుడు బాలీవుడ్ వైపు వెళ్దామని ప్రశాంత్ అనుకున్నాడట. కానీ ఆ అవకాశం రాలేదు. సలార్ లో కేవలం పృధ్వీరాజ్ నటించడమే కాకుండా.. ఓ అసిస్టెంట్ డైరక్టర్ గా, కో-డైరక్టర్ కూడా పనిచేశాడని, తనకు ఎన్నో అమూల్యమైన సలహాలిచ్చాడని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ నీల్. 

Show comments

Related Stories :