అడివి శేష్, శృతిహాసన్.. ఓ బందిపోటు ప్రేమకథ

శృతిహాసన్ తో చేస్తున్న సినిమాను ఓ యాక్షన్ లవ్ స్టోరీగా చెప్పుకొచ్చాడు అడివి శేష్. ఇలాంటి పదాలు మనం తరచుగా వింటున్నవే. సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి, మరో ట్రాక్ లో లవ్ స్టోరీ నడుస్తుందని అంతా అనుకున్నారు. కానీ అడివి శేష్ చెప్పింది 'అక్షరాలా' నిజం.

అడివి శేష్, శృతిహాసన్ సినిమాకు సంబంధించి ఈరోజు టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. ఇంతకుముందే చెప్పినట్టు ఇదొక యాక్షన్ లవ్ స్టోరీ. ఇదేదే హీరో విలన్లను చితకొట్టే యాక్షన్ కాదు. హీరోయిన్ తుపాకీతో హీరోకు గురిపెడుతుంది. హీరో కూడా హీరోయిన్ కు గురి పెడతాడు. ఇద్దరూ ఒకేసారి ఫైర్ చేస్తారు. సరిగ్గా అక్కడే కట్ చేశారు. డకాయిట్ అనే టైటిల్ వేశారు. ఒక ప్రేమకథ అనేది ట్యాగ్ లైన్.

టైటిల్ టీజర్ లో హీరోహీరోయిన్లు ఇద్దరూ మాజీ ప్రేమికులనే విషయం అర్థమౌతూనే ఉంది. తన మాజీ ప్రేయసితో తిరిగి కలవడానికి శేష్ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. చూస్తుంటే, స్టోరీలైన్ చాలా కొత్తగా ఉండేలా ఉంది. షానీల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

మేజర్ తర్వాత అడివి శేష్ చేస్తున్న సినిమా ఇదే. సినిమా షూటింగ్ మొదలైనట్టు టీజర్ లో వెల్లడించారు. ఈ మెగా ప్రాజెక్ట్‌ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాత. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో విడివిడిగా షూట్ చేస్తారు. Readmore!

Show comments

Related Stories :