రంగు రంగులోనూ ఒక సందేశం ఉంది!

కొంత‌మంది దుస్తుల్లో రంగుల ఎంపిక గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోరు! త‌మ శ‌రీర ఛాయ‌కు ఎలాంటి రంగు సెట్ అవుతుంద‌నేది గ్ర‌హించ‌గ‌లిగేది కూడా కొంత‌మందే! అందంగా క‌నిపించాల‌ని అంద‌రికీ ఉంటుంది. అయితే త‌మ‌కు న‌ప్పే రంగేంటో గ్ర‌హించ‌గ‌ల‌డం ఒక ఆర్ట్. ఆ సంగ‌త‌లా ఉంటే.. మూడ్ కు త‌గ్గ‌ట్టుగా, సంద‌ర్భానికి త‌గ్గ‌ట్టుగా డ్ర‌స్సింగ్ చేసుకోవ‌డం ఇంకో ఆర్ట్! దీనికి కొంద‌రు పెద్ద‌గా ప్రాముఖ్య‌త‌ను ఇవ్వ‌రు. అయితే అందంగా జీవించ‌డంలో మూడ్ ను తెలియ‌జెప్పే రీతిలో దుస్తుల రంగుల‌ను ఎంపిక చేసుకోవ‌డం కూడా ఒక  ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం!

రెడ్

ఇది కేవలం క‌మ్యూనిస్టుల క‌ల‌ర్ కాదు. రెడ్ కాన్ఫిడెన్స్ కు నిద‌ర్శ‌నం! మీలో తొణిక‌సలాడుతున్న ఆత్మ‌విశ్వాసాన్ని రెడ్ డ్ర‌స్ తో చాటుకోవ‌చ్చు! రెడ్ డ్ర‌స్ అంద‌రి అటెన్ష‌న్ నూ పొందుతుంది! ఫంక్ష‌న్ల‌లో అయినా, ఫార్మ‌ల్స్ లో అయినా రెడ్ .. అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించే రంగు! కేవ‌లం డ్ర‌స్సే కాదు.. త‌న పెద‌వుల‌కు ఎర్ర‌టి లిప్ స్టిక్ ను అంటించుకునే మగువ త‌న‌తో ఉన్న ఎన‌ర్జీని, ఆత్మ‌విశ్వాసాన్ని చాటుతున్న‌ట్టు! త‌న లుక్ మీద ఆమెకు ఉన్న కాన్ఫిడెన్స్ కు నిద‌ర్శ‌నం ఎర్ర‌టి రంగులో మెరిసే ఏ మేక‌ప్ అయినా!

ఆరెంజ్ Readmore!

ఫ్రెండ్లీ క‌ల‌ర్ గా ఆరెంజ్ కు పేరు! ప్ర‌త్యేకించి మీరు కొత్త వాళ్ల‌ను క‌ల‌వ‌డానికి వెళ్తున్న‌ప్పుడు ఆరెంజ్ ను ధ‌రించ‌డం మీ స్నేహ త‌త్వాన్ని చాటుకోవ‌డం. ఆరెంజ్ వైబ్రెంట్, ఎన‌ర్జిటిక్, రిఫ్రెషింగ్ క‌ల‌ర్. క్రియేటివ్ ఈవెంట్స్ కు, ప‌గ‌టి పూట జ‌రిగే పార్టీల‌కు ఆరెంజ్ ధార‌ణ కొత్త శోభ‌ను తీసుకొస్తుంది. కేవ‌లం దుస్తుల విష‌యంలోనే కాకుండా, మేక‌ప్ లిపిస్టిక్స్, స్కార్ఫ్, నెయిల్ పాలిష్.. ఇలా ఆరెంజ్ తో అద‌ర‌గొట్టొచ్చు ఆ సంద‌ర్భాల‌ను!

పింక్

దీనికి ఫెమినైన్ క‌ల‌ర్ గా పేరు. పింక్ అనేది సాఫ్ట్ నెస్ కు ప‌ర్యాయం. అమ్మాయిల‌కు అయితే ఫ‌స్ట్ డేట్ విష‌యంలో పింక్ ను త‌ల‌ద‌న్నే రంగు ఉండ‌దు. అమ్మాయిల రంగుకు పింక్ కొత్త అద్ద‌కం లాంటిది. సాఫ్ట్ పింక్ లిప్ స్టిక్ అద్దిన న‌వ్వు ఆమె అందాన్ని మ‌రో ఎత్తుకు తీసుకెళ్తుంది! పింక్ ఇయ‌ర్ రింగ్స్, డెలికేట్ నెక్ల‌స్, స్లైలిష్ పింక్ హ్యాండ్ బ్యాక్.. ఇలా పింక్ ప‌రిమ‌ళ‌న్ని వెద‌ల‌జ‌ల్ల‌గలిగేవి ఎన్నో ఉన్నాయి!

బ్లాక్

వివిధ సంస్కృతుల్లో న‌ల్ల‌ని రంగును స్వాగ‌తించ‌రు! న‌ల్ల‌ని దుస్తుల‌ను కూడా వ్య‌తిరేకించే వాళ్లు ఉంటారు సంద‌ర్భాల‌ను బ‌ట్టి. అయితే న‌లుపు కూడా ప‌వ‌ర్ కు సంకేతం! దీన్ని న్యూట్ర‌ల్ క‌ల‌ర్ గా తీసుకోవ‌చ్చు. న‌లుపు రంగులో పార్టీలు ప్ర‌త్యేకం! అలాగే ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రు కావ‌డానికి త‌గిన రంగుగా న‌లుపును సూట్ ల‌ను చెబుతారు. ఆఫీస్ మీటింగుల‌కు, ఇంట‌ర్వ్యూల‌కు బ్లాక్ ఫార్మ‌ల్స్ మంచి ఇంప్రెష‌న్ ను తీసుకొస్తాయంటారు, ఇక లిప్ స్టిక్ ను న‌లుపు రంగులో ధ‌రించే అమ్మాయిలు త‌మ బోల్డ్ నెస్ ను చాటుతున్న‌ట్టు!

వైట్

ఈ రంగును కూడా ఇండియాలో సంప్ర‌దాయబ‌ద్ద‌మైన సంద‌ర్భాల్లో వ్య‌తిరేకిస్తారు! అయితే వైట్ ఎప్పుడూ ప్యూరిటీకి సంకేతం! స్త్రీ క‌న్నా మగ‌వాళ్ల విష‌యంలో వైట్ రాజ్య‌మేలుతుంటుంది! రాజ‌కీయం అంటేనే వైట్ అండ్ వైట్ అన్న‌ట్టుగా ఉంటుంది ద‌క్షిణ భార‌త‌దేశంలో. ఇలా వైట్ అంట్ వైట్ చాలా ప‌వ‌ర్ ఫుల్. అమ్మాయిల విష‌యానికి వ‌స్తే వైట్ ప్యూరిటీకి, ముత్యంలా మెరిసే సొగ‌సుకు నిద‌ర్శ‌నం.

గ్రీన్

గ్రీన్ ఫ్రెష్ నెస్ కు సంకేతం. ఇది కూడా బ్యాలెన్డ్స్, రిఫ్రెషింగ్ టేస్ట్ కు నిద‌ర్శ‌నం. ఎలిగెంట్, ఎర్తీ, అలాగే ఇది రాయ‌ల్ అప్పీరియ‌న్స్! ఔట్ డోర్ ఈవెంట్స్ కు, గార్డెన్ పార్టీస్ కు గ్రీన్ ను చూస్ చేసుకోవ‌చ్చు.

Show comments