చైతన్య ఆశలపై నీళ్లు చల్లిన అల్లుడు

'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం తన మార్కెట్‌ని పెంచుతుందని, స్టార్‌గా నెక్స్‌ట్‌ లెవల్‌కి వెళ్లలేకపోతోన్న తనకి మార్గం సరాళం చేస్తుందని భావించాడు. ఈ చిత్రంపై అపారమైన నమ్మకం వుండడం వల్లే 'సవ్యసాచి'కి ఇచ్చిన డేట్స్‌ కూడా చైతన్య దీనికి షిఫ్ట్‌ చేసి ముందుగా ఇది ఫినిష్‌ చేసాడు. తీరా 'శైలజారెడ్డి అల్లుడు' ప్రేక్షకులని మెప్పించలేకపోయింది.

విడుదలకి ముందు రేకెత్తించిన ఆసక్తి వల్ల ఓపెనింగ్స్‌ బాగా వచ్చినా మూడవ రోజుకే ఈ సినిమా బండారం బయటపడిపోయింది. ఇక సోమవారం నుంచి వసూళ్లు పూర్తిగా పడిపోయాయి. మొదటి రోజు వసూళ్లు చూసి నాగచైతన్యకి కూడా నలభై కోట్ల సినిమా వచ్చిందనే ఆనందం వ్యక్తం చేసిన అభిమానులకి అసలు సంగతి నాలుగు రోజులకి తెలిసి వచ్చింది.

ప్రస్తుతం ఈ చిత్రం బ్రేక్‌ అవుతుందో లేదో అనేది కూడా అనుమానంగానే వుందనేది ట్రేడ్‌ టాక్‌. దీని కోసమని సవ్యసాచి చిత్రాన్ని డిలే చేసి ప్రస్తుతం దానికి సరయిన రిలీజ్‌ డేట్‌ లేకుండా చేసుకున్నారు. ఆ చిత్రం కూడా 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం తరహాలో స్టేల్‌ అయిపోతుందేమో అనే భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి మారుతిపై పెట్టుకున్న ఆశలపై 'అల్లుడు' నీళ్ళు చల్లేసాడు. 

Show comments